TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి ఆమె కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ 2, 3 రోజుల్లో అధికార ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.