SKLM: లావేరులోని తాళ్లవలసలో బుధవారం పంచాయతీ కార్య దర్శి విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీ మోహన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. కార్మికులతో కాలువల్లో ఉన్న వ్యర్థాలను, పూడికలను తీయించించారు. కొళాయిలు, బావులు వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.