కృష్ణా: కూటమి ప్రభుత్వ లక్ష్యం రైతాంగ అభ్యున్నతేనని కూటమి నాయకులు బుధవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. రైతులు లేకుండా వైకాపా నేతలే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గుడివాడలో రైతుల అవసరాలకు అనుగుణంగా 2,946 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఇది గత వైకాపా పాలన కంటే 500 మెట్రిక్ టన్నులు అధికమని తెలిపారు.