ADB: వర్షా కాలం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తాంసి PHC వైద్యాధికారి డాక్టర్ శ్రావ్యవాణి పేర్కొన్నారు. బుధవారం తాంసి ఆశ్రమ పాటశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది విద్యార్థులకు చికిత్స అందించామని 2 రక్త పరీక్షల నమూనాలు సేకరించామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ తులసీరామ్, తదితరులు ఉన్నారు.