AP: టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. అనంతపురం ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహించనున్న ఈ సభకు హాజరయ్యేందుకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. దీంతో అనంతపురంలో సందడి వాతావరణం నెలకొంది.