AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. గత పాలనను సరిదిద్ది.. పరిపాలనను గాడిలో పెడుతున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు.. ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నారు. తమ సూపర్ సిక్స్ పథకాలపై గత ప్రభుత్వం అవహేళన చేసిందని.. కానీ తాము అమలు చేసి నిరూపించామన్నారు.