ELR: ముసునూరు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచికపై ఒకరోజు సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఎంపీడీవో బసవరాజు అత్యుత సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాల పురోభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సకాలంలో అమలు చేయాలన్నారు. పరిశుభ్రత, వర్షపు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.