E.G: దేవరపల్లి మండలంలో ఎంపీపీ నిధులతో చేస్తున్న పలు అభివృద్ధి పనులపై రోజువారి సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ కేవీకే దుర్గారావు బుధువారం తెలిపారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్లో బోరు ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని, డ్రైనేజీ నిర్మాణ దశలో ఉందని వెల్లడించారు. పనులపై రోజువారి సమీక్ష చేసి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా దిశా నిర్దేశం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.