SRCL: చందుర్తి మండల కేంద్రంలోని నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ప్రముఖ ఎన్నారై మోతె రాములు బుధవారం రూ 5 లక్షల విరాళం అందజేశారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో చేపడుతున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారంగా మండల కేంద్రానికి చెందిన మోతే రాములు రూ 5 లక్షల నగదును ఇచ్చారు. ఈ సందర్భంగా మోతె రాములును గ్రామస్తులు అభినందించారు.