ADB: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ స్పూర్తితో భూపోరాటాలు నిర్వహించాలని CPM నాయకులు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఉద్యమించిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు.