HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని బుధవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి, కానీ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. గ్రూప్-1 పరీక్ష విషయంలో ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.