E.G: కొవ్వూరులో గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. స్థానిక వైఎస్టీడీ మాల్ సమీపంలోని ఓ భవనంపై కుళ్ళిన మృతదేహం ఉంది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.