NRML: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. పెంబి మండలంలోని అంకేన గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లావుడ్య శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను జాన్సన్ నాయక్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.