NLG: చిట్యాల మండలంలో ఇటీవల యువకులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారికి కన్నీటిని మిగిలిస్తున్నారు. నేరడకు చెందిన రూపని అఖిల్, ఎలికట్టెకు చెందిన జక్కలి మచ్చగిరి, చిట్యాలకు చెందిన గణేష్ ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. యువకుల మానసిక స్థితిలో వచ్చిన మార్పును తల్లిదండ్రులు గుర్తించి వెంటనే సైకాలజిస్టులను సంప్రదించాలని సూచిస్తున్నారు.