TPT: తిరుపతిలోని వైష్ణవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడాది వయస్సున్న చిన్నారి మృతిచెందింది. కనిగిరికి చెందిన సురేష్, అంజలి దంపతుల చిన్న కుమార్తెను సోమవారం జ్వరం, జలుబుతో అడ్మిట్ చేయించారు. తగ్గిందనుకుని ఆ కుటుంబం మంగళవారం తిరుమల దర్శనానికి వెళ్లారు. అనంతరం పాప మళ్ళీ అస్వస్థతకు గురికావడంతో అదే ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.