PLD: అమరావతిలోని బుద్ధుని విగ్రహ ఆధునీకరణకు పర్యాటక శాఖ రూ.1.85 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని బుధవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో బౌద్ధ స్మారక చిహ్నాలు అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో ఈ ప్రాంతం మరింత ప్రాముఖ్యత పొందుతుందని స్పష్టం చేశారు.