KKD: 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిగా పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 21 మండలాల పరిధిలో 385 గ్రామ పంచాయతీలు, 4,328 వార్డులు, 430 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.