KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగనున్న LLB 4వ సెమిస్టర్, LLM 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం అపరాధ రుసుము (లేట్ ఫీ) లేకుండా SEPT 18 వరకు, లేట్ ఫీజు రుసుము రూ.300తో SEPT 22 వరకు చెల్లించుకోవచ్చన్నారు. ఈ విషయాన్నిశాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణాధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు.