KNR: కొత్తపల్లి ప్రభుత్వ మహిళ కళాశాలలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి, తెలుగు విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మణ్ రావు, పరిమళ, పాల్గొన్నారు.