HYD: సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రైల్వే భద్రత, మహిళా భద్రత కోసం కృషి చేసిన అధికారులకు DRM గోపాలకృష్ణన్ సేఫ్టీ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారందరికీ మెడల్స్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైల్వే సేవలను మరింత ప్రయాణికుల చెంతకు చేర్చాలని సూచించారు.