E.G: రాజమండ్రిలోని ప్రైవేటు అంబులెన్స్‌లపై అసత్య ఆరోపణలు చేయడం తగదని శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి అన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ.. తాము ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కొంత మంది తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.