BDK: బూర్గంపాడు మండలం మేజర్ గ్రామపంచాయతీ సారపాకలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్త అనేకసార్లు గ్రామపంచాయతీ వారి దృష్టికి తీసుకుపోయిన గాని ఎటువంటి ప్రయోజనం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాలాజీ బుధవారం తెలిపారు. చెత్త, మురికినీరు, దోమలతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.