NTR: సైబర్ నేరస్తులు రోజు రోజుకి పెట్రేగిపోతూ సొమ్ము కాజేయడమే పరమావధిగా ఉంటున్నారు. ఇబ్రహీంపట్నంకి చెందిన ఓ మహిళ హాట్ స్టార్ పనిచేయట్లేదు అని గూగుల్‌లోని టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసింది. స్పందించిన సైబర్ నేరగాళ్లు వాట్సప్ లింక్ క్లిక్ చేయాలని కోరారు. క్లిక్ చేయగానే ఆమె ఖాతాలో నుంచి 40వేలు డబ్బులు కాజేశారు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.