GNTR: పొన్నూరు నియోజకవర్గంలో 13 కొత్త గ్రామీణ ఆరోగ్య కేంద్రాల (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7.15 కోట్లు మంజూరు చేయడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మట్లాడుతూ.. అలాగే, రూ. 1.50 కోట్లతో ఆరు విలేజ్ హెల్త్ క్లినిక్ల మరమ్మతులు, అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.