CTR: చిత్తూరు జిల్లాలో రెండో పుణ్యక్షేత్రంగా విరజల్లుతున్న బోయకొండ గంగమ్మను బుధవారం ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. ఈ మేరకు కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి జంతు బలులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శన భాగ్యం అనంతరం ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.