ADB: నార్నూర్ మండలంలోని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటీవల TLM మేళాకు ఎంపికయ్యారు. ఈ సందర్బంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రియదర్శిని స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన మేళాకు వారు హాజరయ్యారు. విద్యార్థులు చేసిన పోస్టర్ ప్రజెంటేషన్, తదితర ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో రాథోడ్ రాజ్ కుమార్, జగన్నాథ్, విజేష్, పల్లవి, వీరేందర్, చంద్రకళ ఉన్నారు.