SRD: ఈనెల 13న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర గురువారం తెలిపారు. ఈ లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్, బ్యాంక్, చిట్ ఫండ్, సివిల్, అలాగే రాజీ కుదుర్చుకోగల కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.