AP: RBKలను గాలికొదిలేశారని.. ఉచిత పంటల బీమాకు పాతరేశారని మాజీ CM జగన్ మండిపడ్డారు. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదని, రైతులకు సున్నావడ్డీ పథకం ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని.. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలని విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రభుత్వ ఆస్తులను పప్పు, బెల్లాలకు అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు.