ADB: రైతుల రుణాలు కోసం ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ అందించిన సహకారం మరువలేనిదని భీంపూర్ మండల BRS నాయకులు ఆఫ్రోజ్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్గా సేవలు అందించి బదిలీపై వెళుతున్న ఆయనను బుధవారం శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ధిక తోడ్పాటుకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.