NLR: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ జయంతి సందర్భంగా బుధవారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులు ఆయనకు నివాళులర్పించారు. ఉపాధ్యా యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ నాయుడమ్మ చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విశేషంగా కృషి చేసి ‘ప్రజల శాస్త్రవేత్తగా’ గుర్తింపు పొందారన్నారు. కేంద్రం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు.