SRCL: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని జిల్లా ఎస్పీ తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్/ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/మహిళ చట్టలపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.