నిర్మాత నాగవంశీ మైథలాజికల్ సినిమాను ప్రకటించారు. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఇది తెరకెక్కనున్నట్లు తెలిపారు. 3D యానిమేటెడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీకి ‘వాయుపుత్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు. 2026 దసరా కానుకగా పాన్ ఇండియా భాషల్లో ఇది విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.