NTR: దసరా ఉత్సవాల నిమిత్తం విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకునే క్యూ లైన్లు వేగంగా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వినాయకస్వామి గుడి వద్ద నుంచి రథం సెంటర్ మలుపు వరకు, అలాగే కనకదుర్గానగర్ నుంచి కేశఖండనశాల వరకు క్యూలైన్ల పనులు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటిని వచ్చే వారం అనుసంధానించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.