BHPL: జిల్లా ఘన్పూర్ సర్కిల్ పరిధిలో దురిశెట్టి నిరంజన్ (28) పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. CI మాట్లాడుతూ.. జంగేడు గ్రామానికి చెందిన నిరంజన్ పై 20కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని సీఐ వెల్లడించారు.