HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణంలో గత గంటసేపటి నుంచి మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు వివరించారు. పలుచోట్ల ఒక్కసారిగా వర్షం ప్రారంభమయ్యే ఛాన్స్ అధికంగా ఉందని పేర్కొంది.