MBNR: ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా ఇబ్బందులలో ఉన్నట్టయితే అధికారులు, ప్రజలు వారికి అండగా నిలబడాలని సూచించారు.