AP: వైసీపీ సర్కారు పాలనలో ఎప్పుడూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీ సీఎం జగన్ తెలిపారు. సీఎం మారినా అధికారులు మారలేదు కదా? అని గుర్తు చేశారు. ఎరువులను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని.. ఇది రూ.250 కోట్ల స్కామ్ అని ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్న విధంగా కూటమి ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు.