GNTR: మంత్రి నారా లోకేశ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ విమర్శించారు. విద్యారంగ సమస్యలపై ఈ నెల 13న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. సదస్సులో విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు.