KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐల్లమ్మ 40వ వర్ధంతి సందర్బంగా రజక సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సాయిప్రసాద్ మాట్లాడుతు.. ఐలమ్మ కేవలం రజకుల కోసం మాత్రమే దొరలతో పోరాటం చేయలేదని. వృత్తి రీత్యా కులాలుగా అణిచివేయబడుతున్న చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, గౌడ, రెక్కడితేగాని డొక్కనిండాని బతుకు జీవుల కోసం పోరాటం చేసిందన్నారు.