యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ‘మిరాయ్’ మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ చివరిలో శ్రీరాముడు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పాత్రలో ఎవరు కనిపించనున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఆ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నట్లు సమాచారం. మేకర్స్ చెబుతున్న సర్ప్రైజ్ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.