MDK: నర్సాపూర్ ప్రధాన పైప్ లైన్‌కు మరమ్మతులు జరుగుతున్నందున, అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో మంజీరా నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ అధికారి శివప్రసాద్ తెలిపారు. దీనివల్ల నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా ఉండదని ఆయన అన్నారు. ఈ మూడు రోజులు ప్రజలు స్థానిక బోరుబావులను ఉపయోగించుకోవాలని సూచించారు.