ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. బుధవారం గంగగుడి గ్రామంలో లబ్దిదారులతో కలిసి నిరసన తెలిపారు. పలువురు ఇళ్ల లబ్ధిదారులు స్లాబ్ లెవల్ వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారని, అయితే బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు నిలిపివేశారన్నారు.