VSP: ఎస్సీ విద్యార్థులపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టినట్లు విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ బి.గణేష్ విమర్శించారు. బుధవారం ఏయూ ఆవరణలో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఎస్సీ ఫెలోషిప్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీనివల్ల ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.