SDPT: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటిన వీరవనిత ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం జగదేవ్పూర్ మండలం తీగల్ గ్రామంలోని వివిధ పార్టీల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూ పోరాటాలు,పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు.