NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక 24వ డివిజన్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించిన కమిషనర్ శాశ్వత పరిష్కారం అందించమని అధికారులను ఆదేశించారు.