ASR: రాబోయే పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ,టూరిస్టుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని డుంబ్రిగుడ మండలం చాపరాయి మేనేజర్ అప్పారావును ఎస్సై పాపి నాయుడు ఆదేశించారు. ముఖ్యమైన మార్గాల్లో సూచక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా సజావుగా నడిపేందుకు ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.