SRD: మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూలడం పట్ల BJP జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని హుటాహుటిన గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులలకు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పక్కా భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి విద్యామంత్రి లేక ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.