TG: గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు TGPSCలో కలవరం సృష్టిస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కమిషన్ పునరాలోచనలో పడింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు సమాచారం. మరోసారి మూల్యాంకనం చేస్తే సమయం వృథా కావడంతో పాటు, కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.