GNTR: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక చిన్నారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం లభించింది. తెనాలి గంగానమ్మపేటకు చెందిన శరత్ కుమార్, తేజస్విని తమ చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవతో రూ. 2.50 లక్షలు మంజూరయ్యాయి. బుధవారం వారికి స్థానిక నాయకులు అందజేశారు.