ATP: వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ ఎన్టీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురంలో బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. జీఎస్టీ స్లాబ్స్‌ను 5%, 18% శాతానికి తగ్గించడంపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.